ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయండి..






జహీరాబాద్ కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి సురేష్ షేట్కార్
దేశ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని జహీరాబాద్ కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి సురేష్ షెట్కర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈనెల 13న జరగనున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి అయిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపాలని సురేష్ షెట్కర్ కోరారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నాయకత్వంలో తాను పనిచేస్తూ జహీరాబాద్ పార్లమెంటరీ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వెల్లడించారు. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీని ఓడించినట్లు, కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఓడించాలని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎంతో మంది నిరుపేదలకు రెండు పడక గదులు నిర్మించిన ఘనత ఆమెకే దక్కిందని ఆయన గుర్తు చేశారు, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణమాఫీ తో పాటు, పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని సురేష్ షెట్కర్ గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. శాసనసభ ఎన్నికల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించడం జరిగిందని, ఈ నాలుగు నెలల్లో ఐదు పథకాలను అమలు చేయడం జరిగిందని, పంద్రాగస్టు తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని సురేష్ షెట్కర్ వెల్లడించారు. గతంలో ఎంపీగా పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. బోధన్ బీదర్ రైల్వే మార్గం కు సర్వే చేయించడం జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గుర్తు చేశారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ మరో మారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సవాడ ఇంచార్జి రవీందర్ రెడ్డి, ఏఐసీసీ స్పోక్ పర్సన్ గిరిజ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ మండల అధ్యక్షులు నియోజకవర్గం సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్, నందు పటేల్, ఎలమంచిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
