ఉపాధి హామీ కూలీలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మీకు మేము అండగా ఉంటామని కోటగిరి మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
బస్వాపూర్, అడ్కస్పల్లి గ్రామాల లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామంలో ఇంటింటి, ఇంటి ప్రచారాన్ని నిర్వహించారు.బాన్సువాడ ఇంచార్జి తెలంగాణ ఉద్యమ కారులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అదేశాల మేరకు జెహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కూలీలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 గ్యారెంటీలు వివరించడం జరిగింది.
గ్రామ కమిటి అద్యక్షులు ఎన్.కృష్ణమూర్తి చారి, కమిటి సబ్యులు
మాజీ ఎంపీటీసీ రాములు, కె.శివకాంత్ జి.రమేష్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సబ్యులు మరియు నాయకులు మరియు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.



