ప్రజలకు అండగా ఉంటాం


కారేగాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
పార్లమెంటు ఎన్నికల్లో గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ప్రజలకు అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిస్సే నాగనాథ్ పటేల్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గ్రామస్తులందరూ ఓటు వేసి మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ పెద్దలు ఇర్వంతరావు పటేల్ కోరారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బంది ఎదురైనా తాము అండగా ఉంటామని, ఎన్నికల కోడ్ అనంతరం గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల మంజూరి చేయిస్తామని, గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న కొంతమందికి బిల్లులు రాలేదని, అటువంటి వారికి బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని, పేదల అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించారని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో దోహదపడతాయని వివరించారు, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బ్యాంకుల్లో పంట రుణాలు ఉన్నాయని, ఆగస్టు 15 తర్వాత ప్రతి ఒక్కరి పంట రుణ అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రజలు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని బూత్ కమిటీ కన్వీనర్, సభ్యులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ పటేల్, గజానన్, జాను, శ్రీను, దిగంబర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
