హన్మకొండ నయింనగర్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ మె డికల్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
మనందరిది ఒకే కుటుంబం డాక్టర్స్ కుటుంబం.
35ఏళ్ల తర్వాత ఒక డాక్టర్ కి, ఒక మహిళకు ఎంపీ గా అవకాశం వచ్చింది.
మీ కుటుంబ సభ్యురాలిగా మీరు అందిస్తున్న సపోర్ట్ ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉండాలి.ఒక వైద్యురాలిగా వైద్యుల, బాధల పై నాకు సంపూర్ణ అవగాహన ఉందనీ పార్లమెంట్ ఎన్నికల్లో అండదండలు అందించాలని భవిష్యత్తులో నాతోటి వైద్యులకు ఏ ఇబ్బందులు ఎదురైన మీ ఆపదలో పాలుపంచుకుంటానని కడియం కావ్య స్పష్టం చేశారు.
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా,
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలి.
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.
ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

