కామ్రేడ్ అజిత్ పాషా, కామ్రేడ్ పశ్య పద్మ, మరియు కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్ నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపించాలని సిపిఐ నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం 6 తేదీ సోమవారం నాడు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని ఫిట్టర్స్ యూనియన్ ఏ ఐటి యుసి కార్యాలయం (కాలూర్ రోడ్డు నూతన కలెక్టరేట్) వద్ద పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమావేశం కలదు.

ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్. అజీజ్ పాషా (మాజీ MP) సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య.పద్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారు
కావున ఈ సమావేశానికి పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల, శాఖ కార్యదర్శిలు, ప్రజా సంఘాల నాయకులు సకాలంలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యదర్శి వై. ఓమయ్య, నాయకులు బి.రఘురాం, పి హనుమాన్లు, ఆనంద్ పాల్గొన్నారు
