కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమే ఈ చేరికలు అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫ్ఫర్ ఘఢ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, యువకులు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తనను నమ్మి వచ్చే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి కట్టుగా పని చేసి మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ తాటికాయల అశోక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ సందీప్, మాజీ సర్పంచ్ తాటికాయల బాబులతో పాటు సుమారు 100మంది నాయకులు ఉన్నారు.
