Sunday, February 15, 2026

జుక్కల్ నియోజకవర్గం లో మెడికల్ కాలేజ్

పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల జుక్కల్ నియోజకవర్గం వెనుకబాటు గురైందని, తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అమలు చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తానని, జుక్కల్ నియోజకవర్గం పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ఖాయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సురేష్ షెట్కార్ గెలుపు కోసం మండే ఎండను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.

జుక్కల్ మండలంలోని చిన్న ఎడిగి, నాగల్ గావ్,పడంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సురేష్ షెట్కార్ ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే తనతో సమన్వయం చేసుకుంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి జుక్కల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.గతంలో సురేష్ షెట్కార్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.
నారాయణ్ ఖేడ్ జుక్కల్ నియోజకవర్గాల మధ్య త్వరలో అతి పెద్ద ఫార్మా సిటీ రాబోతుందని యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.ఆలోచించి అభివృద్ది చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సురేష్ షెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular