నిజామాబాద్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో 123 బూత్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాదిహామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. పిసిసి డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ని గెలిపించాలని ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నిరుపేద కుటుంబానికి 200 యూనిట్ ల వరకు కరెంటు ఫ్రీ,500 రూపాయలకు సిలిండర్,10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తుందని ఎన్నికల కోడ్ తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,
ప్రతి మహిళకు 2500, ఆగస్టు 15లోపు 2 లక్ష రుణమాఫీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందేటట్లు చూస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నిరుపేద మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి అందేటట్లుచేస్తామన్నారు. గతంలో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందనిఅన్నారు. ఉపాదిహామి కూలీ రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి పటేల్, మాజీ సర్పంచ్ శశికళ కాంతారావు, మండల కాంగ్రెస్ కార్యదర్శి గోవూరీ శ్రీనివాస్,మాజీ ఉపసర్పంచ్ రామచందర్ రెడ్డి,గొవూరి అనిల్, సిద్ధింటి కృష్ణారెడ్డి, ప్యాట్ల కృష్ణ,ఎల్లారెడ్డి, గిరి సాయిలు,శంకర్, సాయికుమార్,బాలా గౌడ్,నారా గౌడ్,ప్యాట్ల సాయిలు,గిరి లక్ష్మణ్, కుర్మే లక్ష్మణ్,గోవూరి దత్తు, సంగారెడ్డి,గోవూరి బాలు,గిరి హనుమాండ్లు పాల్గొన్నారు.
కూనీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES
