Sunday, February 15, 2026

పోతంగల్ లో కదిలిన కాంగ్రెస్ దళంఇంటింటి ప్రచారం

నిజామాబాద్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ దళం పోటా పోటీగా ప్రచారం చేపడుతున్నారు. గ్రామంలో నియమించిన బూతు కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఎవరికి వారే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బూతుల వారిగా కన్వీనర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ప్రజలకు సంక్షేమలో అభివృద్ధిలో ఏ అవసరం ఉన్న తాము చేయగలుగుతామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు వివరించారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల ధర్నా చేర్చనున్నామని వివరించారు. ఆగస్టు 15 లోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని, ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

గ్రామంలో నిరుపేదలకు ఎన్నికల కోడ్ తర్వాత ఇందిర మహిళలను మంజూరు చేస్తామని, గత ప్రభుత్వంలోని విధానాలకు చరమగీతం పాడి లబ్ధిదారులే సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, వాటి బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇల్లు నిర్మించుకొని బిల్లులు కొంతమంది పొందలేకపోయారని అటువంటి వారికి కూడా ఎన్నికల అనంతరం బిల్లులు చెల్లింపుకు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు సహకరిస్తామని లబ్ధిదారులకు తెలిపారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలను కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో రాష్ట్రంలో కూలీలకు పనులు లేక వలసలు వెళ్లేవారని, ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పేదలకు కనీసం తని కల్పించి బ్రతికే విధంగా చూసే ప్రయత్నంలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు ప్రారంభించారని పూర్తి చేశారు. ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగు ఫలితం అందడం లేదని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కూలీలకు కనీసం 400 కూలి వచ్చేట్లు చూస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మరో అయిదు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విధంగానే ప్రజలు ఆదరిస్తే కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది అని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేశం, నాయకులు గంధపురాజు, దత్తు, హైమద్, మన్సూర్, గంధపు గంగులు, మాజీ ఎంపిటిసి, వీటితోపాటు నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular