శనివారం ఉదయం సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి, కదంబపూర్, తొగర్రాయి , మంచిరామి,కనుకుల, గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలను కలుస్తూ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే తెలంగాణ తల్లి సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను వివరించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో మీ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు.
స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తాం.

వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ అందజేస్తాం.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తాం.ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ
ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించాడు తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదు.

వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తాం.
రోజువారి కూలీ 400కు పెంచుతాం.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తాం.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలినీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.
