Sunday, February 15, 2026

దేశం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే మోడీతోనే సాధ్యం

కరోనా కష్టకాలంలోనూ దేశ ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు, విదేశాలకు మందులను ఎగుమతి చేసి మన దేశ ఖ్యాతి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇనుమడింప చేశారని నిజామాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. భారతదేశం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే మరోసారి ప్రధానిగా మోడీ పట్టాభిషేకం చేయాలని ప్రజలు అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బోధన్ నియోజకవర్గం లోని నవిపెట్ మండలంలోని జన్నేపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో బిజేపి అభ్యర్ధి ఎంపీ ధర్మపురి అర్వింద్ , బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR), మోహన్ రెడ్డి , బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మేక సంతోష్, వివిధ మండలాల అధ్యక్షులు ప్రవీణ్, ఇంద్రకరణ్ మనోహర్, కొలిపాక బాలరాజు, సరీన్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular