Sunday, February 15, 2026

పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

స్వతంత్రం వచ్చిన నాటినుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భాల్లోనే పేదలకు సంక్షేమ పథకాలము అందిస్తూ వచ్చిందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని వినయ్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.నందిపేట్ మండలం ఖుద్వంపూర్, శపూర్,నందిపేట్ గ్రామాలలో మన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశం మరియు ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో నందిపేట్ మండల కాగ్రెస్ పార్టీ అద్యక్షులు మంద మహిపాల్ ,డొంకేశ్వర్ మండల అద్యక్షులు భూమేష్ రెడ్డి ,సిలిండర్ లింగం, మాన్పుర్ భూమేష్,యూత్ కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఉప అద్యక్షులు బైండ్ల ప్రశాంత్ ,మాజి సర్పంచ్ దర్మన్న, గుండప్ప శంకర్, మన్నే సాగర్,పోశెట్టి,యూసుఫ్,దూడ వెంకటేష్ మాజి ఎంపిటిసి సభ్యులు,గోపి గౌడ్,నాగరాజు,నితిన్,రవి,అక్బర్,బుజ్జి రెడ్డి పాల్గోన్నారు.

కాంగ్రెస్ వస్తేనే ఉపాధి హామీకి.. బతుకు దెరువుకు గ్యారంటీ

ఉపాధి హామీ కూలి రు.400 లకు పెంచుతాం

వేసవిలో 35 శాతం అదనంగా బోనస్ చెల్లిస్తాం

కాంగ్రెస్ పార్టీ కి పేరు వస్తుందని,
మోడీ ఉపాధి హామీ పథకానికి ఏటా నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యం.

కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ..ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

అండగా నిలువాలని.. ఎంపిగా తాటిపత్రి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు.

గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్కే ఓటేస్తెనే సాధ్యం.

సీఎం రేవంత్ రెడ్డీ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేశారు. ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్లు మంజూరు చేస్తాం.మహిళలపై భారం పడకుండా సిలిండర్ ను రూపాయలు 500 కి అందిస్తున్నాం.మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాం.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి.గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.రేషన్ కార్డు రావాలన్నా, పెన్షన్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం.
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల మంజూరు చేస్తాం.
ఇంటింటా తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందించాలని వినయ్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో సోనియా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు.
అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ప్రారంభిస్తే బిజెపి ప్రభుత్వం కూలీలకు చెల్లించే వేతనంలో కోతలు పెడుతోంది.
ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పనులు కల్పించాలనే నియమాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలోతోక్కి పని దినాలు తగ్గించింది.ఏటా ఉపాధి హామీ పథకం నిధులు పెంచాల్సి ఉండగా, నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు.
మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది.ప్రజలు బిజెపి మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని మహిళలను వేడుకొన్నారు.పనిచేసే చోట మౌలిక వసతులు.. ఉపాధి కూలీలను తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తాం.
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పిస్తాం.
గతంలో రుణమాఫీ చేసినం..వచ్చే ఖరీఫ్ నాటికి 2 లక్షలు మాఫీ చేస్తాం.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
బిజెపి కుట్రలు ఇక పై కొనసాగాయి..ఆడ బిడ్డలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular