చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయఘడ్ లోక్ సభ పరిధిలో శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ భారీ సభ నేపథ్యంలో స్థానికంగా ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పర్యవేక్షించారు. సభ నేపథ్యంలో గురువారం రాయఘడ్ లో స్థానిక పిసిసి నేతలు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతరం సోషల్ మీడియా వింగ్, స్థానిక కీలక నేతలతో సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలు,సోషల్ మీడియాలో ప్రచారం గురుంచి సమావేశం నిర్వహించారు.
ఆతరువాత రాయఘడ్ లో నివసిస్తున్న తెలుగు వైశ్యులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు డిప్యూటీ సీఎంను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలుగు వైశ్యకళింగ సంఘం పేరిట జరిగిన ఈ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


