Sunday, February 15, 2026

పోతంగల్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని పోతంగల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు ముమ్మరం చేశారు. పెద్ద గ్రామం కావడంతో బూతుల వారీగా ఎవరికి వారే పోటాపోటీగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఓటర్లకు కాంగ్రెస్ కార్యకర్తలు వివరించారు. గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని వారందరికీ రాబోయే రోజుల్లో మంజూరు చేపిస్తామని నాయకులు ఓటర్లకు వివరించారు. ఇందిరమ్మ కాలం నుండి పేదల కోసం పాటుపడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఒకటేనని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఎన్నికల అప్పుడు ఎన్నో పార్టీలు నాయకుడు గ్రామాల్లో వచ్చి ప్రజలను ఇరకాటంలో పెడతారని ప్రజలు ఓటు వేసే సందర్భంలో మన ఇబ్బందుల్లో ఎవరు ఆదుకుంటారు వారి పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు ఆలోచింప చేసే విధంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేశం, గంధపు గంగులు, దత్తు, ధన్ రాజ్, మన్సూర్, మాజీ ఎంపీటీసీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular