పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో బాన్సువాడ ప్రజలు గెలిపిస్తే బాన్సువాడ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం ఐకమత్యంతో ఉండి రవీందర్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేసి తీరుతామని ప్రజలకు వివరించారు. బాన్స్ వాడ పట్టణములో 13,14 వార్డ్ లలో టీచర్ కాలనీ ,మిశ్రీ గల్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులూ కలిసి ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు, 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తూ, గృహ విద్యుత్ ఉచితంగా అందజేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ గెలిపించినట్లయితే జహీరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్ మాజీ ఎంపీటీసీలు శేఖర్ గౌడ్ , అధికార ప్రతినిది గుడాల నగేష్ ,మాజీ వార్డ్ సభ్యులు జహీర్ బిట్ల సూరి , రాయిస్ , దాసరి శ్రీనివాస్ , అజీమ్ ,పట్టణ ఉపాధ్యక్షులు మన్నన్ , కొట్టం గంగాధర్ ,
రఫీ ఉల్లహ , వెంకన్న యాదవ్ ,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




