Sunday, February 15, 2026

పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తాం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని గ్రామస్తులకు ఏ సమస్యలున్నా తాము పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ మండలం కారేగం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలో ఇల్లు లేని వారికి ఎన్నికల అనంతరం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు అన్నిటిని గ్రామంలోని ప్రజలకు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని గ్రామ పార్టీ అధ్యక్షులు నాగనాథ్ పటేల్ వివరించారు. ఆగస్టు 15 తర్వాత గ్రామంలోని రైతులందరి పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని, తిరిగి బ్యాంకు నుండి రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular