కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తన భుజస్కందాలపై ఎత్తుకుంటానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సర్కార్ మనదే ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇప్పటికే కొన్ని గ్యారెంటీ పథకాలను అమలు చేశామని, ఎన్నికల కోడ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాన్ని ఓర్చుకోలేక కాంగ్రెస్ను బదలాం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయని, ప్రజలు పార్లమెంటరీ ఎన్నికల్లో వారి మాటలు నమ్మి మోసపోవద్దని షబ్బీర్ అన్నారు. ఆగస్టు 15 తర్వాత పంట రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసి తీరుతుంది అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం రెడ్డిపేట గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చీరంజీవి, బీజేపీ బూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, మరియు 30 మంది బీజేపీ సీనియర్ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని భరోసా ఇచ్చారు.

