Sunday, February 15, 2026

కోటగిరి లోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తాం

కోటగిరి లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ నాయకులు

కోటగిరి మండల కేంద్రంలోని వేదలందరికి ఇంద్ర మహిళను మంజూరు చేస్తామని, గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకుని బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్నికల కోడ్ అనంతరం బిల్లులు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్లమదు ఓటర్లకు వివరించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పలు వార్డులలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మరో అయిదు గ్యారెంటీ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుందని మహిళలకు పేదలకు పెద్దపీట వేయడం కాంగ్రెస్తోనే సాధ్యమని నాయకులు ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంద్, మైనార్టీ నాయకులు వహీద్, నజీర్, డ్రైవర్ సాయిలు, గంగారాం తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular