Sunday, February 15, 2026

పోచారం గ్రామంలోనూ కారు దిగి హస్తం గూటికి

బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో కారు దిగి పలువురు హస్తం గూటికి చేరారు. బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో పేదల దారిన చేర్చడమే తన లక్ష్యంగా భావిస్తున్నానని ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చేవారి అందరికీ న్యాయం చేస్తామని తమతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని కొత్త పాత అనే తేడా చూపకుండా ప్రజల్లో బలమున్నవారికి ప్రాధాన్యమిస్తామన్నారు.
పార్టీలో చేరిన వారిలో కుర్రోళ్ల మోహన్ మరియు సాయిలు కేరళ మొగులయ్య చిన్న సాయిలు, విట్టల్ మరియు బంజారా గిరిజన నాయకుడు బానోత్ సురేష్ బానోత్ భీమ్ సింగ్ వీరందరూ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రవి చవాన్ , మండల అధ్యక్షులు మంత్రి గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొట్టమొదటిసారిగా పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు ఇప్పుడు వరకు చరిత్రలో అడుగు పెట్టలేదు మొట్టమొదటిసారిగా డైనమిక్ లీడర్ ప్రజల ఆదరణ పొందుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి గ్రామంలో అడుగుపెట్టి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోచారం గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకుడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ మరియు ప్రముఖ వ్యాపారస్తులు శ్రీనివాసరావు, కిషోర్ యాదవ్ ,శ్రీనివాస్ యాదవ్ ,బోనగిరి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాడ్లు ,వెంకట్ రెడ్డి, అంజాత్ ఖాన్ మరియు పిఎసిఎస్ చైర్మన్ దశరత్ నాయక్ బానోత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular