పార్లమెంటు ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధిని చేసే బాధ్యత తనదేనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజలకు భరోసా ఇచ్చారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఈ ప్రాంత వెనుకబాటుకు గతంలోని పాలకులే కారణమన్నారు. తాను నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయినప్పటికీ తనను ఆదరించి గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని ప్రజల కష్టసుఖాల్లో తాను పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టం చేశారు.జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం తాడ్గుర్, కరగ్,చిన్న తాడ్గుర్ మరియు అంతపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌమ్యుడు,విజ్ఞానవంతుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సురేష్ షెట్కార్ ని గెలిపిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని.
తాను అడిగి మరి పనులు చేయిస్తానని అన్నారు.
సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే తనతో సమన్వయం చేసుకుంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి జుక్కల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





