స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్ర


లక్ష్మీ నరసింహ స్వామి వారి 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు చేపట్టారు.
మేడ్చల్ జిల్లా,కీసర మండలం,చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా *తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా,కీసర మండల చీర్యాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని..స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సమృద్ధిగా వర్షాలు పడి..కరువు అంతమై..పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు.
