నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యూ) జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ మాట్లాడుతూ దేశంలో గత పది సంవత్సరాలుగా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, దేశ, విదేశీ బడా పెట్టుబడి దారులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తూ, దేశంలో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్న బీజేపీ పార్టీని ఓడించాలని కార్మికులకు బి. మల్లేష్ కార్మికులకు పిలుపు నిచ్చారు. బీడీ పరిశ్రమపై అత్యధికంగా జీఎస్టీని వేసి లాభాలను పొందుతూ మరోవైపు పరిశ్రమని నిర్వీర్యపరిచి,అందులో పని చేసే బీడీ కార్మికులను 26 దినాలు పని లేకుండా చేసి, రోడ్డుపాలు చేస్తుందని, కార్మికులు కష్టపడి పీఎఫ్ ను జమ చేసుకుంటే, అట్టి పీఎఫ్ డబ్బులు నుండి 20% షేర్ మార్కెట్లో పెడుతుందని, మరోవైపు వారి సంక్షేమం కోసం గతంలో అమలు చేసిన పథకాలను రద్దు చేసిందని, అట్లాగే వారు రాజీనామాలు చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ను పెంచాలని పది సంవత్సరాలుగా పోరాడుతున్న కనీసం ఏమాత్రం పెంచలేదని అందుకే బీడీ కార్మికులు బీ జే పీ పార్టీకి ఓటు వేయోద్దన్ని బీడీ కార్మికులకు బి.మల్లేష్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యూ నాయకులు ఈర్షద్ భాయ్, పి డి ఎస్ యు నాయకులు మౌనిక, చందు మరియు జానకంపేట గ్రామ బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక,ఫాసిస్టు బీ జే పీ పార్టీని ఓడించాలి.
RELATED ARTICLES
