ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.
మునపల్లి మండల కేంద్రంలోని గార్డెన్ లో నిర్వహించిన ముఖ్య కార్యక్రమల సమావేశం లో దామోదర రాజా నరసింహ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్గొన్నారు.
ఈ సమావేశం లో అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువత విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదరసింహ విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత 10 ఏండ్ల కుటుంబ పాలన పోవడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో స్వేచ్చాయుత ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఇచ్చిన వాగ్దానాలను 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టిన 4 నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ ను, ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆందోల్ నియోజకవర్గం లో సుమారు 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. వట్పల్లిలో పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. వట్పల్లిని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.
11 కోట్లతో వట్పల్లిలోని మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
గత పది ఏళ్లలో నిర్లక్ష్యం చేసిన రోడ్లను నూతనంగా నిర్మించడానికి ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. త్వరలో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట లో 55 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నామన్నారు.
జోగిపేట ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.
వచ్చే నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయన్నారు. గత 10 సంవత్సరాల లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి అవకాశం కల్పిస్తామన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీలు లేవన్నారు. తెలంగాణలోని మాదిరిగా కేంద్రం లో పదేళ్ల పాలన ను ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ ని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి చెందుతుందన్నారు.
నియోజకవర్గంలో త్వరలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
రాజకీయాల్లో కార్యకర్తలు, యువత పాత్ర ఎంతో గొప్పదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.


