Sunday, February 15, 2026

బిజెపిని గెలిపిస్తే 1825 కోట్ల నిధులు తెస్తాం

సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు గోడం నాగేష్ ని ఆశీర్వదిస్తే రోజుకు కోటి రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో రూ.1825 కోట్ల నిధులు కేంద్రం నుండి తీసుకొస్తాం – సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

కాగజ్ నగర్ : పట్టణంలోని ఎస్పియం క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ తనను ఆశీర్వదించినట్టే గోడం నాగేష్ ని కూడా ఆశీర్వదించాలని, రోజుకు కోటి రూపాయల చొప్పున 5 సం.లకు రూ.1825 కోట్ల నిధులు తీసుకువస్తామని తెలియజేశారు. సిర్పూర్ నియోజకవర్గం 119 నియోజకవర్గాలోనే వెనుకబడిందని , అందుకని వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మోదీజీ ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్తె అవతారం ఎత్తిందని, కాబట్టి దాన్నుంచి ఏం ఆశించలేమని తెలిపారు.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిగా చేయాలని బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular