హోరెత్తిన గద్వాల్ “జన జాతర “భారీ బహిరంగ సభ. జన సందోహంతో కార్యకర్తల ఆనందోత్సవాలతో గద్వాల్ లో జన జాతర సభ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నేతలకు ఘన స్వాగతం పలికారు.రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక 5 గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవి ని గెలిపించాలని పిలిపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే నడిగడ్డ అభివృద్ధి చెందుతుందన్నారు. జోగులాంబ సాక్షిగా రైతుల 2లక్షల రుణ మాఫీ చేస్తానన్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలను మల్లు రవి ని గెలిపించాలని కోరారు.




