గత ప్రభుత్వం దళితులకు దళిత బంధంతో బీ ఆర్ఎస్ బంద్ గా మార్చుకున్నారని దళిత బందులో కమిషన్లు దండుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. దళితులకు 10 లక్షలు అందిస్తామని సగం డబ్బులు గులాబీ పెద్దలు దిగమింగారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కి మద్దతుగా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ త్ నగర్,నిజాంసాగర్, అచ్చంపేట్,ఆరేడు, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.ఎమ్మేల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక లో తనకు ఓట్లు వేసి గెలిపించినందుకు గానూ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.అదేవిధంగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సురేష్ షెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో దాదాపుగా అన్ని పూర్తి చేశామని, రైతులకు రుణమాఫీ ఆగష్టు 15 లోపు చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రతి గ్రామంలో సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించి, వీధి దీపాలు పెట్టిస్తామని చెప్పారు.
నిజాంసాగర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు దళిత బంధు పేరిట పేద ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నారని, ఇప్పుడు దానిపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గానికి అధికంగా నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
అందుకే ఆలోచించి అభివృద్ది చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.




