Sunday, February 15, 2026

బిబి పాటీల్ కు ఓటు వేసి మోడీని ప్రధాని చేయండి

బిబి పాటిల్ కృషి వల్లే జహీరాబాద్ అభివృద్ధి

వెనుకబడిన నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి చేసిన బిబి పాటిల్

రానున్న రోజుల్లో మరిన్ని హైవేలు, రైల్వే లైన్లు వస్తాయి

జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓటు వేసి గెలిపించి మూడోసారి ముచ్చటగా మోడీని ప్రధానమంత్రిగా చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు.

బీబీ పాటిల్ కృషివల్లే జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి ఎండల లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. గత పది ఏళ్లలో కేంద్రంలోని బిజెపి సర్కారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి పార్టీ చేపట్టబోయే పనులకు సంబంధించిన మేనిఫెస్టోను ఉపాధి కూలీలకు వివరించారు. ఉపాధి కూలీల వద్దకు బిజెపి నాయకులు మోడీ మాస్కులు ధరించి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం మోడీ మోడీ కోసం మనం అనే నినాదంతో బిజెపి నాయకులు తమ మేనిఫెస్టో కరపత్రాన్ని ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం మండల బిజెపి పార్టీ కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన కొందరి యువకులు బిజెపి పార్టీలో చేరారు. బిజెపి పార్టీలో చేరిన వారికి ఎండల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన గత పది ఏళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాలకు భయపడుతూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కనీస గుర్తింపు తీసుకు రావడంలో విఫలమయ్యారని మండి పడ్డారు. మోడీ వచ్చాక గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచ దేశాలు ప్రస్తుతం భారతదేశాన్ని చూసి మోడీ లాంటి పవర్ ఫుల్ నాయకుడు తమకుంటే బాగుంటుందని అనుకుంటున్నారన్నారు. కరోనా కష్ట సమయంలో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి మోడీ ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వడం కాకుండా ఇతర దేశాలకు సైతం టీకాలు సరఫరా చేసి అండగా నిలిచిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరించిన పాలన విధానాలు మోడీని యూనివర్సల్ లీడర్ గా పేరు తెచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో మోడీ హవా నడుస్తుందని మరోమారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈసారి నాలుగు వందలకు పైగా ఎంపీలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

జహీరాబాద్ దశను మార్చిన బీబీ పాటిల్

తెలంగాణ,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు నియోజకవర్గంగా ఉన్న జహీరాబాద్ నియోజకవర్గాన్ని 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని చెప్పారు. బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ అయిన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలతో ఆయనకున్న సత్సంబంధాలతో గత పది ఏళ్లలో బీబీ పాటిల్ వేల కోట్ల రూపాయల నిధులతో జహీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. నేషనల్ హైవేల నిర్మాణం, బోధన్ బీదర్ రైల్వే లైన్ మంజూరు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయడంలో కేంద్రంతో మాట్లాడి బిబి పాటిల్ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ఒకప్పుడు వెనుకబడి ఉన్న జహీరాబాద్ నియోజకవర్గాన్ని బీబీ పాటిల్ వేగంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మరోసారి బీబీ పాటిల్ ఎంపీగా గెలిస్తే జహీరాబాద్ నియోజకవర్గానికి మరిన్ని హైవేలు, రైల్వే లైన్లు, కేంద్రీయ విద్యాలయాలతోపాటు అభివృద్ధికి నిధులు వస్తాయని చెప్పారు. ప్రజలందరూ కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల భూటకపు మాటలు నమ్మకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరోసారి బిబి పాటిల్ ని జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్యామల కులకర్ణి ,బిజెపి బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ ,కో కన్వీనర్ గాండ్ల శ్రీనివాస్, కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్, సీనియర్ బిజెపి నాయకులు పుల్లెల మోహన్ రావు, మామిడి శ్రీనివాస్, హౌగిరి రావు దేశాయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు దవులయ్య, గోగినేని శ్రీనివాస్,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular