Monday, February 16, 2026

నిజాంసాగర్ లో పలువురు కాంగ్రెస్ లో చేరిక

జుక్కల్ నియోజకవర్గంలో గులాబీ తమ్ముళ్లు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జుక్కల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని ఎంతో మంది ప్రజలు ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే సైతం ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన శాసశక్తుల కృషి చేయడంతో పాటు, కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించగలగడంతో గత పాలకులు కన్నా ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు భేష్ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బిజెపి అభ్యర్థి మదనూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు నువ్వా నేనా అన్న చందంగా ఎన్నికల్లో తలపడుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ ఆనాటికి నేటికి నియోజకవర్గంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఎమ్మెల్యే ప్రజల్లో కొద్దికాలంలోనే మంచి ఆదరణ పొందారు. వివిధ పార్టీలకు చెందిన ఎంతోమంది నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ప్రతినిత్యం ఎంతో మంది చేరుతున్నారు.

పలువురు కాంగ్రెస్ లో చేరిక

నిజాంసాగర్ మండలం నర్సింగరావు పల్లి గ్రామంలో
బిచ్కుంద మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular