తనను గెలిపిస్తే పాలకురాలిగా కాకుండా సేవకురాలుగా ఐదేళ్లపాటు మీకు సేవలందిస్తానని ఎంపీ అభ్యర్థి సునీత వెల్లడి




అధికారంలోకి రాగానే కులగణన చేపడుతాం
పేద మహిళలకు లక్ష సాయం
మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా…ఆదరించండి
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మ్యానిఫెస్టో
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పిలుపు
కుత్బుల్లాపూర్ నియోజకవరర్గంలో సునితమ్మ సుడిగాలి ప్రచారం
మండుటెండలో భారీగా తరలివచ్చిన జనం
కుత్బుల్లాపూర్:మరోసారి బీజేపీకి ఓట్లేసి అదికారం ఇస్తే రాజ్యాంగం పేదలకు కల్పించిన రిజర్వేషన్లు తొలగిస్తారని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ కొలాన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన చంద్రగిరి నగర్, జగద్గిరిగుట్ట, భగత్ సింగ్ నగర్, చింతల్, పద్మనగర్ ఫేస్ – 2 రింగ్ రోడ్, సుభాష్ నగర్ బస్టాప్, సుభాష్ నగర్, సంజయ్ గాంధీ నగర్ సూరారం డివిజన్లలో పట్నం సునీతా మహేంధర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం చేశారు. మండుటెండలోనూ రోడ్డు షోలకు మహిళలు భారీగా తరలివచ్చి సునితమ్మపై అభిమానాన్ని చాటారు. తాము సునితమ్మ అభయహస్తం కోసం ఆమె వెన్నంటే నడుస్తామని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ప్రత్యే మ్యానిఫెస్టోను తయారు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ వారం రోజులు పనిచేస్తే తాను 5 ఏళ్ళు నాయకురాలుగా కాకుండా ప్రజల మధ్యే ఉండి సేవకురాలిగా పనిచేస్తానని మాట ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన ఉందని, రంగారెడ్డి జడ్పి చైర్ పర్సన్ గా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మీ ఇంటి ఆడపడచుగా తనను ఆదరించి అండగా నిలవాలని కోరారు. మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులు, వ్యాపారస్తులు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు. అంతకు ముందు ఇంచార్జీ హన్మంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, మాట్లాడుతూ మంచి మనసున్న నాయకురాలు సునీతా మహేంధర్ రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి, జిల్లా మహిళ అధ్యక్షురాలు లక్ష్మీ, జడ్పి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు లాయక్, గణేష్, శివ, పండరీ, రైమతుల్లా, శ్రీధర్ రెడ్డి, రాధాకృష్ణ, బేకు సీను, కొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్, జేమ్స్, తమ్మని శ్రవణ్, ఐలయ్య గౌడ్, రషీద్, కృష్ణ గౌడ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
