మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా జోరుగా ప్రచారం
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోయసియేషన్
కడియం కావ్యకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోయసియేషన్
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నది. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు లభిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతు ప్రకటించింది. కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంతంలోని దర్గా పీఠాధిపతి హజ్రత్ షా ఉబెయిద్ బాబా నివాసంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ముద్రించిన పోస్టర్ ను కొండా సురేఖ, మురళీ దంపతులు, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, దర్గా పీఠాధిపతి హజ్రత్ షా ఉబెయిద్ బాబా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షకీల్ అహ్మద్ (గోరె బాయ్), వీరన్న, ఖాజా పాషా, బషీర్, మగ్ధూం, కె. రాజు, ఓరుగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేయనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ముస్లిం మత పెద్దలు దువా చేసి మద్దతు తెలిపారు.
