తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేనీ హామీలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేలు గెలుపొందారాని, మరోసారి ప్రజలు మోసపోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీలో పర్యటించి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .కోటీశ్వరుడు అయినా పేదవారు అయినా స్వంత ఇల్లు అవసరం. బాన్సువాడ నియోజకవర్గంలో పేదవారి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా ఆశయం.
ప్రభుత్వ నిధులతో 70 ఎకరాలను కొనుగోలు చేసి సంగమేశ్వర కాలనీ ఏర్పాటు చేసాను. ఇందులోని 1550 ప్లాట్లను స్వంత ఇంటి స్థలం లేని పేదలకు అందించాను.
ప్రజలకు అన్ని వసతులు ఉండాలని రూ. 12 కోట్లతో కాలనీలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి వసతులు కల్పించాను. బాన్సువాడ పట్టణానికి 1200 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేశాను.బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేయించాను. ఇందులో 10,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చింది.18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు.
అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. 6 గ్యారంటీల అమలు వెన్నెలకు నోచుకుంటాయని పోచారం ప్రశ్నించారు.స్కూళ్ళు, కాలేజీ లకు వెళ్ళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.ఎన్నికల ముందు హామీలను ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి అయిదు నెలలు అయినా హామీలను అమలు చేయడం లేదు.వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సీట్లు దొరకక నిలబడి ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు.కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచిండు, రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో లక్షా నూటపదహార్లు ఇస్తా అని ఇచ్చారు, 24 గంటల విద్యుత్ అందించారు.మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి కేసీఆర్.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి వ్యక్తి బ్యాంకు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని మోడీ అన్నడు.అందరు మే 13 న జరిగే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని మనవి.

