ఇప్పటికే 167 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించినట్లు జుక్కల్ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించారు.
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని వెల్గనూరు,మంగ్లూర్,నర్సింగరావు పల్లి,జక్కాపూర్, మల్లూరు గ్రామాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.





ఎమ్మేల్యే మాట్లాడుతూ తాను ఎమ్మేల్యే అయిన అతి కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలోని గ్రామాలకు రోడ్లు డ్రైనేజీలు పంచాయతీ, అంగన్వాడి, స్కూల్ భవనాలు,సెంట్రల్ లైటింగ్ మరియు వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించానని మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు.నియోజకవర్గంలోని 167 గ్రామాలకు మంచి నీటి సమస్య ఉందని తెలుసుకుని వెంటనే బోర్లు వేయించి ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని కోడ్ పూర్తవ్వగానే మళ్లీ మొదలు పెడుతమన్నారు.ఇన్నేళ్లు హన్మంత్ షిండే ఎమ్మెల్యేగా బిబి పాటిల్ ఎంపీగా ఉండి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని..
ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో హన్మంత్ షిండే ను ఓడించి బుద్ధి చెప్పారని అదేవిధంగా ఇప్పుడు బిబి పాటిల్ కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
