కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.
కేంద్రం పోలవరం కోసం 15వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని అయితే ఈ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు.
కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసిపి ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.
విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసిపి ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
