Monday, February 16, 2026

కష్టకాలంలో కాంగ్రెస్ వెంట ఉన్న కార్యకర్తలను మరవం

గత పదివేలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టాల్లో ఉన్నదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మరవదని వారికి ఏ కష్టం వచ్చినా అండదండలు అందిస్తామని నిజామాబాద్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులను చూశామని, నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలు తీర నున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు ఎవరైనా సరే మేము అందరనీ స్వాగతిస్తున్నామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చందూరు మండలం నుండి మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేయించి తీరుతామని అంబర్ సింగ్ దీ మా వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని, ఎన్నికల అనంతరం ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలను కాంగ్రెస్ పార్టీ అన్నిటిని అమలు చేసి తీరుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత పాలకులు ప్రభుత్వ సొమ్మును తమ సొంత సొమ్ముగా ఇస్తారాజ్యంగా ఖర్చు పెట్టారని, ప్రజల సొమ్ము గులాబీ పార్టీ బాసుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.

చందూర్ మండలంలో కాంగ్రెస్ కు మెజార్టీ ఓట్లు

చందూర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సభ్యులు సురేష్ షెట్కార్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన చందూర్ మండల జెడ్పీటీసీ, నిజామాబాద్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ , ఈ సంధర్భంగా చందూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సాలూరి శేఖర్, మరియు సీనియర్ నాయకులు బాలకిషన్ గౌడ్ ,పోస్ట్ రాజయ్య అంబర్ సింగ్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ప్రచారం లో పాల్గొనడం జరిగింది, కార్యక్రమం లో మండల అధ్యక్షులు పోతరాజు శ్రీనివాస్ , చందూర్ విలేజ్ అధ్యక్షులు గుర్ల మల్లయ్య , కిసాన్ కేత్ అధ్యక్షులు గుర్ల సాయిలు , మేకల శ్రీను, అర్షద్, సల్మాన్, అజ్జు,మక్కల సాయి,మరియు పార్టీ కార్యకర్తలు యువకులు ప్రచారం లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular