Monday, February 16, 2026

మత విద్వేషాలతో దేశం పురోగతి చెందదు

రోడ్ షోలో మండిపడ్డ కేసీఆర్

ఉన్నత విద్యకు కేంద్రం తెలంగాణకు అన్యాయం

నేను మోడీకి వ్యతిరేకిని నా కూతుర్ నీ జైల్లో పెట్టారు

తెలంగాణ ఉద్యమంలోనూ ఉద్యమానికి నిజాంబాద్ ఊపిరి పోసింది

400 సీట్లు బిజెపి గెలుపొందడం కల మాత్రమే

దేశంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే

కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో తెలంగాణ ప్రజలను మోసం

అచ్చే దిన్ అంటూ బిజెపి సచ్చేదిన్ వచ్చింది

భారతీయ జనతా పార్టీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మరోసారి అధికారంలోకి రావాలనే కుయుక్తులు పన్నుతుందని, మతవిద్వేషాలతో దేశం పురోగతి చెందదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 200 సీట్లకు మించి గెలుపొందని, కాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఆలోచన చేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కెసిఆర్ నిజాంబాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాంబాద్ పట్టణంలో గులాబీ దళపతి రోడ్ షో నిర్వహించారు. ఆయనకు గులాబీ తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ప్రజలను చూసి కేసిఆర్ ఆవేదనతో ప్రసంగించారు. మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ అయితే అచ్చేదినంటూ ప్రచారం చేస్తున్నారని, బిజెపి వస్తే ప్రజలు సచ్చేది వస్తుంది అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ అవ కొనసాగుతుందని బూటక ప్రచారాలు చేస్తూ మరోసారి దేశ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకే ప్రజల మగ్గుచూపుతున్నారని రాబోయే కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని, డిసెంబర్ 9న పంట రుణాలను మాఫీ చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టేశారన్నారు. కేంద్రంలో 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు దేశాన్ని నిలయంగా మార్చింది అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో బిజెపి పార్టీ పార్లమెంటు స్థానాలు చేజిక్కించుకుంటుందన్నారు. 6 గ్యారంటీలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. నిజాంబాద్ ప్రజలు ఉద్యమంలోనూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసారని, అలాంటి టైం మరోసారి ఆసన్నమైందని టైగర్ లాంటి తమ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రగల్బాల్ పలుకుతుందని, తాను 159 లేఖలు రాసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోవడం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించింది అన్నారు.బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్ సదుపాయం కల్పించారా తెలంగాణలో వారి బాధలను చూడలేక తాము పెన్షన్ పథకాన్ని అమలు చేశామన్నారు. నేను బిజెపికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకినని అందువల్లనే నా కూతురు నీ జైల్లో పెట్టారని కెసిఆర్ భయపడి వాడు కాదని, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం సహజమని, ఇప్పటికైనా తెలంగాణలో ప్రజలు మా వెంట ఉన్నారని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమాన్ని ప్రారంభించడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రజల ధరిన చర్చి ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ప్రజల వెంట ఉండి ఉద్యమిస్తానని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిద్రపోనన్నారు. నిజాంబాద్ జిల్లాను కాంగ్రెస్ టిడిపిలు నిర్లక్ష్యం చేశాయని, జిల్లా వెనుకబాటుకు ఆ పార్టీలే కారణమన్నారు. నిజాంబాద్ జిల్లా ప్రజలు ఎన్నటికీ మర వనని నిజాంబాద్ రైతుల సంక్షేమం కోరే వట్టిపోయిన శ్రీరాంసాగర్ ను కాలేశ్వరం జలాలతో అనుసంధానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్ సతీమణి ఐయేషా ఫాతిమా, జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular