గతంలో పనులు చేద్దామన్న పనులు దొరకని సందర్భంలో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఆలాంటి పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి నేటి వరకు ఉపాధి హామీ పనులు కొనసాగుతూ ఉన్నాయి, ఉపాధి కూలీలకు శ్రమకు తగ్గ ఫలితాన్ని ప్రభుత్వాలు అందించడం లేదు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలను ఆదరించి తీరుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొడాలి సురేష్ కూలీలకు వివరించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో ఉపాధి పనులు చేపడుతున్న కూలీలకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ అందజేశారు. ఉపాధి కూలీలకు ఇబ్బందులు కాకుండా వేసవిలో సమయానికి అనుకూలంగా కూలీలు ఇంటికి తిరుగు ముఖం పట్టాలని సూచించారు. గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులను ఉపాధి ద్వారా చేపట్టాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. ఉపాధి పనులు నిర్వహించే ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యాన్ని, ప్రధమ చికిత్స మందులను అందుబాటులో ఉంచే విధంగా చూడాలని కొడాలి సురేష్ సూచించారు. ఎన్నికల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అన్ని అమలు చేసి తీరుతామని ప్రజలు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని మన ప్రాంత అభివృద్ధికి నిధులు సమకూర్చటంలో పార్లమెంట్ సభ్యులు కూడా సహకరించి తీరుతారని వివరించారు.



