Tuesday, June 30, 2026

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అభివృద్ధి చేసుకుందాం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామస్తులు ఓట్లు వేయాలని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులకు ఉపాధి హామీ కూలీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని, సంక్షేమ పథకాలను గ్రామస్తులందరికీ అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రస్తుత ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ఉపాధి కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలను ఆదరించి తీరుతామన్నారు.
బిచ్కుంద మండల పెద్ద తక్కడ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శేట్కార్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రవి పటేల్ ,హన్మంతు రావ్ దేశాయ్ ,గ్రామ అధ్యక్షులు ఉమాకాంత్ ,మార్గపు సాయిలు ,వట్ వట్ నాగ్ నాథ్ ,శివ లింగ్ నాగ్ నాథ్ ,సాయ గౌడ్ ,సందీప్ ,సాయిలు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular