పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించండి, బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడంతో పాటు, పేదలకు సంక్షేమ పథకాలను అందించుతామని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సందర్భంలో శ్రీకారం చుట్టారని వివరించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా రాహుల్ గాంధీ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే హామీ ఇచ్చారని వివరించారు. ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూడాలని ఉపాధి సిబ్బందికి ఫోన్ ద్వారా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడారు. ఉపాధి హామీ పనుల వద్ద ట్రాక్టర్ ను నడపడంతో పాటు కాంగ్రెస్ నాయకులు కూలీలతో పనులను నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రజలకు ఏ సేవలు అందించాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది చాలని, వారు వారి కుటుంబ ఆస్తులను పెంచుకున్నారే కానీ ప్రజల బాగోగుల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాలను గులాబీ పార్టీ కార్యకర్తలకే అందించారు. నిరుపేదలకు సంక్షేమాలను అందించడంలో గత నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయ శక్తుల కృషి చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడు అయినా పట్టుకుంటాను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను రెట్టింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. రుద్రూర్ మండల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేస్తామన్నారు.



పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రుద్రూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మరియు గ్రామప్రజల తో మాట్లాడుతూ పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రవీందర్ రెడ్డి.
