జహీరాబాద్ ఎంపీ బిబి పా టిల్ ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని బిజెపి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే అన్నారు.
బీర్కూరు మండలంలోని బైరాపూర్ మరియు బస్వాపూర్ గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను కలిసి బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కి మద్దతుగా బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాల బిజెపి పాలనలో జహీరాబాద్ పార్లమెంటులో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ విద్యారంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు అందించి కేంద్రీయ విద్యాలయాలు మరియు పంచాయతీరాజ్ పాఠశాలలను మోడల్ స్కూల్స్కు అభివృద్ధి చేసిన ఘనత మోడీ దన్నారు. జాతీయ రహదారుల నిర్మాణము మరియు పునరుద్ధరణ కొరకు జహీరాబాద్ పార్లమెంట్లో కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. మరియు ప్రజా ఆరోగ్య సంరక్షణలో పురోభివృద్ధి కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంబులెన్స్ వాహనాలు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు .మరియు రైల్వే రంగంలో పురోగతిని తేవడం కోసం 4814.25 కోట్లతో కొత్త రైల్వే లైన్లో తాండూరు సిమెంట్ ప్లాస్టర్ కామారెడ్డి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషనులను మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు సుగుణ సీనియర్ నాయకులు అర్సపల్లి సాయిరెడ్డి , డాకయ్య, ముత్యాల సాయిబాబా చీకట్ల రాజు రాజాసింగ్ ,నాంపల్లి శ్యామ్ ,శంకర్ నాయక్ అబ్బ శేఖర్ ,ధనుంజయ్ ,బైరాపూర్ శక్తి కేంద్రం ఇంచార్జ్ రాజు బూత్ అధ్యక్షులు,నగేష్,ప్రవీణ్,సాయి,కార్తికేయ,శశి తదితరులు ఉన్నారు.






