Monday, February 16, 2026

ఉపాధి హామీ కూలీలను ఆదుకుంటాం

ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని, పనుల ప్రదేశాల్లో వసతులను కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపడితే ఉపాధి హామీ కూలీలను ఆదుకొని తీరుతామని జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు కూలీలకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అవినీతి అక్రమాలకు తావిచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించి తీరుతామన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని ప్రజలు ఏ సమస్య ఉన్న తమ దృష్టి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వివరించారు.జుక్కల్ మండలం దోస్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజు పాటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్వార్ వినోద్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి కష్ట సుఖాలను తేలుసుకొని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ ని గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో దోస్ పల్లి మాజీ సర్పంచ్ ఈరప్ప, పాండురంగ పాటేల్, దత్తు మాజీ ఎంపీపీ లక్ష్మణ్ పాటేల్,గుండూర్ సర్పంచ్ దేవి దాస్,పడంపల్లి ఉప సర్పంచ్ వాగ్మారే లక్ష్మణ్, మారుతి అడే , ప్రసాద్, జ్ఞాను,అస్పత్వార్‌‌ అరుణ్,సాయికర్ణ జాధవ్, గాయక్వడ్ విఠల్ తుదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular