Monday, February 16, 2026

పోటు ఎత్తిన ఓటుపెను సునామీ సృష్టిస్తోన్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్మేధావి వర్గంలో మహా చైతన్యం!

6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అఫ్లై చేయడమే దేశ చరిత్రలో పెను సంచలనం అయితే మొన్న ప్రారంభం అయిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పెను సంచలనాలను నమోదు చేస్తుంది.

దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 100% పోలింగ్ కు పరుగులు పెడుతోంది.

అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో పోస్టల్ బ్యాలెట్ లు చాలక పోలింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొంది.

తాడికొండ చరిత్రలో నేనెప్పుడూ చూసి ఎరుగని రీతిలో నిన్నంతా లాం – ఫెసిలిటేషన్ సెంటర్ లో పడిగాపులు పడిన ఉపాధ్యాయులు ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈరోజు ఉదయాన్నే మాచర్ల, గురజాల, దాచేపల్లి, వినుకొండ, పెదకూరపాడు సుదూర ప్రాంతాలకు పయనమై స్త్రీ, పురుష వయోభేదం లేకుండా ఓటుకు పోటెత్తిన తీరు సంభ్రమాశ్చర్యచకితుడ్ని చేసింది.

పెదకూరపాడు ఫెసిలిటేషన్ సెంటర్ లో చంటిపిల్లలున్న స్త్రీమూర్తులు, వృద్దులు గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, అమరావతి ఇలా ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా రావడం, లిస్ట్ లో ‌పేరు మిస్ అయ్యింది అంటే‌ అర్దరాత్రి అయినా ఓటెయ్యనిదే కదలం అని స్త్రీలు అత్యంత పట్టుదలతో అడ్డం తిరిగి నిలబడటం జీవితంలో కనీవనీ ఎరుగని పెను సంచలనమే!

అంచనా ప్రకారం ఈ ఓట్ల సునామీ చూస్తుంటే ఖచ్చితంగా 99% పోలింగ్ నమోదై తీరుతుంది అనడంలో నిస్సందేహంగా ఏ సందేహం లేనే లేదు.

మేధావి వర్గంలో ఈ మహా‌‌ చైతన్యం ఏ ప్రస్థానానికి నాంది పలుకుతుందో వేచి చూడాల్సిందే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular