ఎంపీటీసి ఉమా రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు చేపట్టారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లారు. దిగువ ఫారంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నుండి ఎంతోమంది వీడి కాంగ్రెస్ బిజెపిలో చేరారు. కొంతమంది మాత్రం తాము పోచారం వెంటే ఉంటామంటూ, పార్లమెంటు ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తాము అన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. హెగ్డోలి గ్రామానికి చెందిన దొడ్డిమీద రాంబాబు పార్టీ నియమ నిబంధనలే లక్ష్యంగా భావిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు. గ్రామానికి చెందిన ఎంతోమంది పార్టీని వీడినప్పటికీ ఉన్నవారితో పార్టీని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకుంటామని కార్యకర్తలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నప్పటికీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందడం కొంతమంది కార్యకర్తలకు మనోధైర్యాన్నిస్తుంది. రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని, పోచారాన్ని నమ్ముకుని ఉంటే భవిష్యత్తులో తమకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొంతమంది ఆలోచన చేస్తున్నారు.





గాలి అనిల్ కుమార్ కే మా ఓటు
పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కె మా ఓటు అంటూ గ్రామాల్లో కొంతవరకు పార్టీ ఉనికిని కాపాడుకునే దిశలో కార్యకర్తలు పనిచేస్తున్నారు. 35 ఏళ్ల పాటు పోచారం సుదీర్ఘ రాజకీయ జీవితంలో బాన్సువాడ నియోజకవర్గం లో టిడిపి, లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెరపైకి రావడంతో ఆనాటి ఉద్యమం ఉవ్వెత్తున రావడంతో చేసేదేమీ లేక టిడిపికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ బాట పట్టి కెసిఆర్ పంచన చేరారు. ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఎన్నికల్లో ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గం లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గులాబీ పార్టీలోనూ ఎన్నో ఉన్నత పదవులను చేపట్టారు. మూడోసారి టిఆర్ఎస్ పార్టీలో ముచ్చటగా గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారం కోల్పోవడం, బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమికి వెనకడుగు వేయకుండా బాన్సువాడ లోనే ఉంటూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ పార్టీని వీడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోపక్క బీఆర్ఎస్ ఎంపీ బిబి పాటిల్ బిజెపిలో చేరడంతో కొంతమంది బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో సైతం నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు పోచారం వెంటే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ కొంతవరకు దెబ్బతింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్థానానికి దిగజారే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. పార్టీకి కష్టకాలం వచ్చిందని, భావిస్తూనే తమ పార్టీ ఉనికిని కాపాడి తీరాలన్న దృఢ సంకల్పం ఆ పార్టీ క్యాడర్ పనిచేస్తుంది.
