పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమీపిస్తుండడంతో ఏనుగు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని టాక్లీ గ్రామంలో ఏనుగు రవీందర్ రెడ్డి మంగళవారం కాలు మోపారు. ఉమ్మడి కోటగిరి మండలంలో సోంపూర్ టాక్లి గ్రామాలు ఇప్పటివరకు తమ సొంత జాగీర్గా పోచారం భావించేవారు. శాసనసభ ఎన్నికల్లో సైతం ఆ గ్రామాల్లో పోచారాము మెజార్టీ ఓటు సాధించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి తీరాలన్న ఏకైక లక్ష్యంతో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. తాను ఓటమి పాలైనప్పటికీ ఓటమిని మరచి గెలుపుకు ఓటమి నాందిగా పలుకుతుందని ధీమాగా ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో 2004లో మినహా ఎప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రాలేదు. మరో నాలుగున్నర ఏళ్లపాటు ఎమ్మెల్యే ఎన్నికలు లేవని తనకు ఓట్లతో అవసరం లేదని కానీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తీరుతానని హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలహీనంగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 15 రోజుల ముందర కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ టికెట్ కేటాయించింది. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో బలంగా నమ్మకంగా ఉన్నారని, ఆ బలమే తన బలంగా భావిస్తూ కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నేటి పరిస్థితులు నియోజకవర్గంలో తారు మారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. బిజెపి మాత్రం శాసనసభ ఎన్నికల్లో అతి బలహీనంగా ఉన్నప్పటికీ ఎండల లక్ష్మి నారాయణ కు ఆ పార్టీ టికెట్ కేటాయించడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో బిజెపి సైతం తమ ఉనికిని చాటుకుంది. నేటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ఎన్నికల ప్రచారంలో పోటీ పడుతున్నాయి. దేశంలో ఓ పక్క మోడీ ప్రభంజనం ఉండడం, మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలను చే జి క్కిచ్చుకుంది. రాజకీయ పరిస్థితులను బాన్సువాడలో మార్పు చేసి తీరుతానని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏనుగు రవీందర్ రెడ్డి, తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉనికి కూడా ఉండేది కాదు. అటువంటి గ్రామాల్లో సైతం ఏనుగు రవీందర్ రెడ్డి దూకుడు పెంచుతూ ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు వేస్తే తాను ముఖ్యమంత్రి కాళ్లు అయిన పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధికి రెట్టింపు నిధులు తెచ్చి తీరుతానని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. మరో నాలుగున్నర ఏళ్లపాటు శాసనసభ ఎన్నికలు లేనప్పటికీ, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుందామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యం చేస్తూ ముందుకు వెళుతున్నారు. తనకు నాలుగున్నరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని, అయినప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడలో కాంగ్రెస్ సత్తా చాటి తీరుతానని బల్లగుద్ది చెప్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎంతో వెనుకబడి ఉందని, వెనుక బాటును ముందంజలో ఉంచాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఆనాడు పార్టీలో లేకపోయినా నేడు పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారికి ప్రాధాన్యమిస్తామని ఇతర పార్టీల వారిని ఎక్కువగా ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఏ లక్ష్యంగా భావించి ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా ఆయన కూడా హాజరై బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి నాయకుడు ఒక్కో బూత్ లో ప్రచారం చేసి నాతో సహా పాల్గొని తీరాల్సిందేనని, హుకుం జారీ చేశారు. తాను కూడా బాన్సువాడలో ఒక బూత్ పర్యవేక్షించి ఆ బూతులో మెజార్టీ ఓట్లు సాధించే బాధ్యత తనదేనని, ప్రతి బూత్ కన్వీనర్ మెజార్టీ ఓట్లు సాధించే విధంగా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం నాలుగు రోజులతో ముగియను ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు, కాంగ్రెస్ పార్టీలో పలువురిని చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. పోచారానికి చెమటలు పడుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పగడ్బందీగా పనిచేస్తే పోచారం బాన్సువాడ నుండి హైదరాబాదుకు మఖం మారుస్తారని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల అనంతరం అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగర వేసి తీరుదామని ఏనుగు రవీందర్ రెడ్డి శబదం చేస్తున్నారు. గతంలో బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధిపరని మొదలు పెట్టాలన్న, ప్రారంభించాలన్న పోచారం కుటుంబ సభ్యులు వచ్చేవరకు ప్రారంభించడానికి వీలుండేది కాదని, అలాంటి పరిస్థితులను మార్పు చేసి గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులే పనులను చేపట్టుకునే విధంగా చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు.



పలువురు కాంగ్రెస్ లో చేరిక
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి తనకున్న హంగు ఆర్భాటాన్ని, సిద్ధం చేసుకుంటూ కాంగ్రెస్ దళంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆర్భాటంగా చేపడుతున్నారు. టాక్లీ గ్రామంలో మంగళవారం ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సమ న్యాయం ఇస్తామని ఏనుగు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ , మాజీ ఎంపీపీ గంగ పవన్ కుమార్ ,వల్లేపల్లి శ్రీనివాసరావు, అనంత విట్టల్, బాబీ సెట్, రాజు, గంధపు రాజు, వట్టి కొండ సాయిబాబా, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
