Monday, February 16, 2026

తొర్రురు మండలంలో బిఆర్ఎస్ కాళీ అయోమయంలో ఎర్రబెల్లి

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడు కిషోర్ రెడ్డి చేరిక

పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడు రామసహాయం కిషోర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

మంగళవారం మండలంలోని వెలికట్ట శివారు శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల సమక్షంలో మడిపల్లి, కంటయపాలెం, మాటేడు, తొర్రూరుకు చెందిన సుమారు 2000 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది నిలిచేది కాంగ్రెస్ పార్టీనేనని, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవక ముందే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారని, గేట్లు తెలిస్తే ఆ పార్టీ నియోజకవర్గంలో ఖాళీ కావడం ఖాయమని అన్నారు.
రాబోయే ఎన్నికలలో ఐక్యతతో కలిసి పనిచేసే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత కొత్త తేడా లేకుండా కలిసి పార్టీ బలోపేతం కోసం పని చెయ్యాలని పిలుపు నిచ్చారు. రాబోయే రోజుల్లో పాలకుర్తిలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు._ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కి పాలకుర్తి నియోజకవర్గం నుండి 50 వేలకు పైగా మెజార్టీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రాయపర్తి మండలం సన్నూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నుండి 50 మంది నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి అద్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular