Monday, February 16, 2026

అవినీతి బిజెపిని అస్సలు గెలవనివ్వం

సిపిఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన స్థానిక రైస్ మిల్ ఫిట్టర్స్ యూనియన్ ఏఐటియుసి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ బోధన్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పి.సుదర్శన్ రెడ్డి, CPI జాతీయ కార్యదర్శి మాజీ M.P అజీజ్ పాషా పాల్గొనగా అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాన్, సిపిఐ నాయకులు కే.భూమయ్య, వై.ఓమయ్యలు సమావేశం ఉద్దేశించి మాట్లాడారు

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు సుదర్శన్ రెడ్డి, అజీజ్ పాషా, మహేష్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ దేశంలో బిజెపి అవినీతి తారా స్థాయికి చేరిందని సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సమస్యలు బిజెపికి పట్టడం లేదని అన్నారు
వ్యవసాయ రంగానికి, కార్మిక వర్గానికి బిజెపి చేసింది శూన్యమన్నారు.ఎన్నికల అప్పుడు మాత్రమే బిజెపికి పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొస్తాయి ఎన్నికల తర్వాత మర్చిపోతుందని అన్నారు బిజెపి 400 సీట్లు వస్తాయని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుందని కానీ ఇప్పటికే సౌత్ లో సాఫ్ట్ అయిందని నార్త్ లో బిజెపి 100 స్థానాలకు మించి గెలవదని అన్నారు. ఎంపీ అరవింద్ పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. అవినీతి మచ్చలేని నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు సిపిఐ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఏ.రాజేశ్వర్, ఆరేపల్లి సాయిలు, వై.రాజిరెడ్డి, కే రాజన్న,దేవేందర్, కండ్లకోయ గంగాధర్, రఘురాం,రంజిత్, భాగ్యలక్ష్మి, అనిల్ కుమార్, ఇమ్రాన్ అలీ, ఫిరోజ్ అలీ, శ్రీనివాస్, సురేష్, వివిధ మండలాల కార్యదర్శులు,శాఖ కార్యదర్శిలు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular