Monday, February 16, 2026

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

రాష్ట్ర ఐటి పరిశ్రమలు&శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం మంథనిలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. యాసంగిలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమయము కంటే ముందే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది.ఈసి ఎలక్షన్ ని అస్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకుండా కుట్రలు చేసింది.బీజేపీకి రైతులన్న అన్నదాతలు అన్న అక్కసు ఆగ్రహం కేంద్రంలో నల్ల చట్టాలను తీసుకవఛి రైతులను నట్టేట్ట ముచ్చే కార్యక్రమం చేసింది.నల్ల చట్టలపై పోరాటము చేసిన రైతులను బీజేపీ పార్టీ ఇబ్బందులకు గురి చేసి పొట్టన పెట్టుకుంది.రాష్ట్రములో బిఆరెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతు బంధు తో రైతుల ఖాతాలల్లో డబ్బులను జమ చెయ్యడం జరిగింది.ఈసి ని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రైతుల ఖాతాలో జమ అయినా సొమ్మును నిలిపివేసే కార్యక్రమం చేస్తుంది.బీజేపీ చేస్తున్న కుట్రలు రైతులు అందరూ గమనించాలి.
రైతు బందు (రైతు భరోసా) డబ్బులు రైతులకు రైతుల ఖాతాలల్లో క్రమ క్రమంగా జమ చేస్తున్నాము.దీనిని ఈసి ఎందుకు నిలిపివేసిందని బీజేపీ లో భాగంగానే కుట్ర అని చాలా స్పష్టంగా కనబడుతుంది.
బీజేపీ,బిఆరెస్ పార్టీ లు రైతు బంధు (రైతు భరోసా) నిధులను నిలుపుదల చేసి రెండు పార్టీ లు కుట్రలు చేసింది.రైతులకు ఈ రెండు పార్టీ లు రైతులకు సమాధానం చెప్పాలి.బీజేపీ, బిఆరెస్ పార్టీలకు రైతులు గట్టిగ బుద్ది చెప్పాలి.ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.రైతులకు సంబందించిన ఎరువులు,పని ముట్ల కు ఎలాంటి సబ్సిడీ లేకుండా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ లలో ఉచిత బస్ సౌకర్యం,500 గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత కరెంట్,10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేశాం.ఎలక్షన్ కోడ్ తర్వాత మిగిలిన హామీలను తప్పకుండ అమలు చేస్తాం. ప్రతి పేద వాడికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ముందుకు తీసుకవేళ్తాము.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చదువుకున్న యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది.ఈ పది సంవత్సరం కాలం లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు.ఎరువులు,డీజిల్,పెట్రోల్ ల ధరలు పెంచి రైతులకు అన్ని రకాలుగా నష్టం చేయడం జరిగింది.గిరిజనులకు,దళితులకు ఏ విధంగా మేలు చెయ్యడకుండా మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు.
బీజేపీ పార్టీ ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు.సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిదంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా ప్రతి ఒక్కరి సమాచారం తెలియజేయాలనీ కొత్త చట్టాలను తీసుకవచ్చే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ.గత కేంద్రం బడ్జెట్ లో ఉపాధి హామీ పథకాన్నీ నీరు గార్చే ప్రయత్నం చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన లాల్ శర్మ ని మేము అడుగుతావున్నాము.కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పటం వస్తావమా కాదా… బీసీ,ఎస్సి, మీ ఎస్టీ రిజర్వేషన్ లను మారుస్తాం అని చెప్పటం ప్రత్యేక్షముగా పరోక్షంగా చెప్పటం వాస్తవమ కాదా.. అని మేము అడుగుతున్నాము.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించి, రాజ్యాంగాన్ని స్ఫూర్తి సమానత్వాన్ని, ప్రతి ఒక్క వ్యక్తికి సమాన హక్కులు కల్పించి వ్యవస్థలను నిర్మాణం చేసేది రాజ్యాంగం స్ఫూర్తి.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కి అనుగుణంగా 75 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలకు,బీసీ లకు,మైనారిటీ లకు మేలు చెయ్యాలని సమానత్వాన్ని తిసుకరావాలని ఆలోచన చేస్తున్న నేపథ్యం.
బీజేపీ పార్టీ రాజ్యాంగాన్నీ తిరగరాసి ఎస్సి,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ లు తీసివేయాలని బీజేపీ పార్టీ విధానాలు చూస్తే స్పష్టంగా కనబడతవుంది.
సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గె, ఓబీసీ లకు కుల గణాన కార్యక్రమం రాష్ట్రము లో మొదలు పెట్టడం జరిగింది.జనాభా కుల గణన ప్రకారం బడ్జెట్ కేటాయింపు చేసుకొని రాహుల్ గాంధీ నాయకత్వంలో జనాభా ప్రతిపాదికన ఆ శాతం వారికీ ఆర్థికంగా,సామాజికంగా రాజకీయంగా హక్కులను కల్పియాలని ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి , కేబినెట్ లో నిర్ణయం తీసుకోని బీసీ లకు కుల విభజన ఒక విప్లవత్మకమైన అలోచన చేసి ముందుకు తిసుకెళ్తున్నాము.
రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశ స్థాయిలో కూడా అన్ని వర్గాల వారికీ మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది.రాష్ట్ర విభజన సమయంలో ఇదే ప్రధాన మంత్రి రాష్ట్ర ప్రజలను,మనోభావాలను హేళన చేశారు.రాష్ట్ర మనోభావాలను దెబ్బ తియ్యడమే కాకుండా విభజన చట్టాలను అమలు చెయ్యకుండా రాష్ట్రనికి రావాల్సిన వ్యస్థలను రానీయకుండా అడ్డుకుంటూ.. బీజేపీ పార్టీ కి కి బిఆరెస్ పార్టీ వెనుక నుండి పూర్తిగా స్థాయిలో సపోర్ట్ చేస్తూ.. విభజన చట్టంలో ఉన్న విశ్వ విద్యాలయాలు,బయ్యారం ఉక్కుఫ్యాక్టరి,ఐటీడిఏ,ఎన్టీపిసి,మైనింగ్ యూనివర్సిటీ అనేక అంశాలు పక్కన పెట్టడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular