కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే రామ మందిరానికి ముప్పు
కాలేశ్వరం అవినీతిపై గగ్గోలు విచారణ మాట ఏమిటి
తెలంగాణలో డబల్ ఆర్ కలెక్షన్ త్రిబుల్ ఆర్ కు మించింది
ఆదాని అంబానీలతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం
హైదరాబాదును ఎంఐఎంకు ధారా దత్తం చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ ల ప్రయత్నం
వ్యవసాయాన్ని ఆధునికరించి లాభసాటిగా మార్చాం
దేశంలో రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
తెలంగాణ ప్రజల కలలను ఉద్యమ పార్టీ తుంచివేసింది
భారతదేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాం, దేశ ప్రజలందరి చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేశాం. ప్రజలందరూ సంతోషిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈర్ష ద్వేషాలతో రామ మందిర్ నిర్మాణం పై ద్వేషం వెళ్ళగకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు అవినీతిలో పాలుపంచుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రధానమంత్రి మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బిజెపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని దేశ ప్రధాని సందర్శించారు. వేద పండితులు బిజెపి నాయకులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ అశేష జనవాహిని ని చూసి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను గుజరాత్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే ఆ ప్రాంతాన్ని ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశానని, తెలంగాణ ప్రజలు చూపుతున్న ఆదరణ తనకు ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. భారతదేశంలో సమర్ధత ఉన్న వ్యవసాయ ఆర్థిక రంగాలను అణచివేసి వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీ కారణమని మండిపడ్డారు. వ్యవసాయాన్ని ఆధునికరణ చేసి లాభసాటిగా మార్చామని, నానో యూరియా ఫసల్ బీమా, యువకుల్లో నైపుణ్యం పెంచామన్నారు. గతంలో పెద్ద ఎత్తున దేశ రక్షణ కోసం ఆయుధాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని, నేడు ఆయుధాలను ఎగుమతి చేసే పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చామన్నారు. దేశంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు మద్దతిస్తే నేడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కలల ను తుంచి వేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ లు అవినీతిలో తోడు దొంగలుగా నల్లధనాన్ని పోగు చేసుకుంటున్నారని అన్నారు. కాలేశ్వరంలో భారీ అక్రమాలు ఉన్నాయని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికీ విచారణ కూడా చేపట్టకపోవడం విచారకరమన్నారు. త్రిబుల్ ఆర్ కలెక్షన్ కు డబుల్ ఆర్ కలెక్షన్ తెలంగాణలో మించిపోయిందన్నారు. తెలంగాణలో నల్లధనాన్ని పోగేసి టెంపుల్ లో ఢిల్లీకి పంపుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాలరాసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయబోతుందని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇచ్చే ప్రయత్నంలో ఉందన్నారు. ఆదాని అంబానీలను ప్రతినిత్యం తిట్ల పురాణంతో ప్రారంభించే కాంగ్రెస్ ఎన్నికల ప్రారంభం కాగానే చీకటి ఒప్పందం కుదుర్చుకొని నోరు మెదపడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు అనే ఒక్క ఆయుధంతోనే దేశాన్ని ఈ స్థాయిలోకి తీసుకురాగలిగామని, కేంద్ర ప్రభుత్వం పనితనాన్ని మీరందరూ పదేళ్లు చూస్తూ ఉన్నారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే దేశం రూపురేఖలు మారుస్తామన్నారు. ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అటువంటి వారిని కాంగ్రెస్ అవమానించింది అన్నారు. వారి మూడు తరాల కుటుంబ సభ్యులతో కలవడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. దేశాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి కావడంతోనే ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చామన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానంలో నిలిపాయమన్నారు. హైదరాబాదును ఎంఐఎంకు ద్వారా చేసే ప్రయత్నాల్లో తెలంగాణ రాజకీయ పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని., బిజెపి రాజీ పాడిన పోరాటం చేస్తూ ఎంఐఎం పై తీటైన అభ్యర్థిని బరిలో దింపామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకొస్తే రామ మందిరానికి ముప్పు
దేశ ప్రజలందరి కోరిక మేరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని ప్రజలందరూ సంతోషాలు వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్వేషాన్ని వెళ్ళగొస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మార్పు చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని తొలగిస్తామన్న పుకార్లను కాంగ్రెస్ పార్టీ చేపడుతుందన్నారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి తెలంగాణ ప్రజల గుర్తింపుగా తలుపులను అందజేశారని అవి ఆలయానికి ఎంతో వెలుగును నింపాయని మోదీ అన్నారు. రామ మందిరం రక్షణ కొరకు తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేద్దామని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి రామ మందిరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ఖాయమైందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడం ఖాయమని, టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతయిందని, కరీంనగర్ లో మెజార్టీ కోసమే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు కరీంనగర్ నుండి బండి సంజయ్ ను, ఆదిలాబాద్ నుండి గూడెం నగేష్ ను, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గోమాత శ్రీనివాసు ను గెలిపించి తనకు మద్దతు ఇవ్వాలని, వారు ముగ్గురు గెలిస్తే తాను దేశంలో మరోసారి ప్రధానమంత్రి కాగలుగుతానని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
