Monday, February 16, 2026

కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయండి తాను అండగా ఉంటా

పార్లమెంట్ ఎన్నికలు సంధర్భంగా బుధవారం ఉదయాన్నే బిచ్కుంద మండల కేంద్రంలో మరియు లచ్చన్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గడప గడపకు వెళ్లి హస్తం గుర్తుకు ఓట్లు వేసి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ని గెలిపించాలని ప్రజలను కోరారు.హోటల్స్, షాప్స్,చిరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.బస్టాండ్ లో ప్రయాణికులు, ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పథకాలు మరియు అమలు చేసిన గ్యారెంటీలను
వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి ఆదరిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular