Monday, February 16, 2026

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక.

కోటగిరి మండలంలోని కొత్తపల్లి,దేవునిగుట్ట తాండా గ్రామాలకు చెందిన 45 మంది బిఆర్ఎస్ నాయకులు,ప్రజా ప్రతినిధులు బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,మాజి ఎమ్మె ల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి,మాజి సర్పంచ్ కృష్ణ రెడ్డి,కొత్త పల్లి,దేవునిగుట్ట తాండ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో వార్డ్ మెంబర్స్ పుల్ సింగ్, రవీందర్ నారాయణ,తాండ పెద్ద నాయక్ హేమ్లా నాయక్,మాజీ ఆదర్శ రైతు దన్ సింగ్,యూత్ సభ్యులు మెగావత్ ధన్ సింగ్ తో పాటు 40 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.కిషన్,కే.జైపాల్, కే.రవి,వి.తారసింగ్,ఎక్స్ ఎంపీటీసీ కే.పకిరా,వి.కిషన్,పి.అశోక్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular