బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ వీక్లీ మార్కెట్ నుండి బాన్సువాడ ప్రధాన మురికి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. మురికి కాలువలు చెత్తాచెదారం పేరుకుపోవడం వల్లన మురికి నీరు ప్రవహించ కుండా ఆగిపోయింది. పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు, గుడుగుట్ల అనిల్ కుమార్ బాన్సువాడ మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించారు. బాన్సువాడ ప్రజలు రోగాల బారిన పడకముందే మున్సిపాలిటీ అధికారులు కనులు తెరిచి ఇకనైనా మురికి కాలువలు శుభ్రం చేయాలని కోరారు
బాన్సువాడ పట్టణంలో పట్టించుకోని మున్సిపల్ చైర్మన్
RELATED ARTICLES
